TG: ఓ ఇంటర్ విద్యార్థి కాలేజ్ హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్న ఘటన HYDలో జరిగింది. విజయవాడకు చెందిన కౌశిక్ రాఘవ మియాపూర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. నిన్న అర్ధరాత్రి కౌశిక్ హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని మరణించాడు. దీంతో విద్యార్థి బంధువులు కాలేజ్ వద్ద ఆందోళన నిర్వహించారు. చదువు విషయంలో ఒత్తిడి వల్లే కౌశిక్ మరణించాడని, కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.