టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కొత్త రికార్డ్ నెలకొల్పాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్(WTC)లో 2వేల పరుగులు చేసిన తొలి వికెట్ కీపర్‌గా రికార్డ్ సృష్టించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో పంత్ 37 పరుగులు చేయడం ద్వారా ఈ రికార్డ్ నమోదు చేశాడు. కాగా WTCలో 2000 పరుగులు చేసిన మూడో భారత బ్యాటర్‌గా పంత్ నిలిచాడు. రోహిత్(2685), కోహ్లీ(2432) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.