బ్రిటన్ రాజధాని లండన్‌లో హైఅలర్ట్ పరిస్థితి ఏర్పడింది. నగరంలో అమెరికా ఎంబసీ కార్యాలయం బయట ఒక అనుమాస్పద ప్యాకేజీ కలకలం సృష్టించింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ప్యాకేజ్‌ను నిర్వీర్యం చేశారు. అయితే ఆ ప్యాకేజీ ఎలా వచ్చిందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అమెరికా ఎంబసీ పేర్కొంది. మరోవైపు గాట్విక్ ఎయిర్‌పోర్టులో భద్రతాపరమైన ఘటన జరగగా.. ఎయిర్‌పోర్టు ఖాళీ చేయించారని అధికారులు వెల్లడించారు.