TG: మెడిసిన్ సప్లై చెయిన్‌లో మూడు దశలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహా తెలిపారు. సచివాలయంలో సెంట్రల్ మెడికల్ స్టోర్లు, ఆస్పత్రిలో ఫార్మసీల బలోపేతం, ఫుడ్ సేఫ్టీ అంశాలపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇండెంట్ దగ్గర నుంచి పేషెంట్‌కు చేరే వరకు సక్రమంగా డిస్ట్రిబ్యూషన్ జరిగేందుకు ఇవి ఉపయోగపడతాయన్నారు. ప్రతి దశకు ఓ స్పెషలాఫీసర్‌ను నియమించాలని మంత్రి ఉన్నతాధికారులకు సూచించారు.