TG: వికారాబాద్ జిల్లా లగచర్లకు కాంగ్రెస్ ప్రతినిధుల బృందం వెళ్లి వచ్చింది. ఈ క్రమంలో నిజనిర్ధారణ కమిటీ లగచర్ల వెళ్లిందని ఎంపీ మల్లు రవి అన్నారు. కలెక్టర్, రైతులతో మాట్లాడామని తెలిపారు. గతంలో ఇలాంటి దాడులు ఎప్పుడూ చూడలేదని.. ఈ దాడి వెనక BRS హస్తం ఉందని తెలిపారు. CM, ప్రతిపక్షాలకు రిపోర్ట్ ఇస్తామన్నారు. లగచర్లలో రైతుల స్వేచ్ఛకు భంగం కలిగిందని పేర్కొన్నారు. BRS నేతలు కుట్రపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు.