అదానీ గ్రూప్ లంచాల వ్యవహారం భారతదేశాన్ని కుదిపేస్తోంది. అమెరికా చేసిన ఆరోపణలు ప్రస్తుతం పొలిటికల్‌గా తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా తమిళనాడులోని స్టాలిక్ ప్రభుత్వంపై కూడా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలపై సీఎం స్పందించారు. అదానీ గ్రూప్ లంచాల ఆరోపణలను స్టాలిన్ తోసిపుచ్చారు. అదానీ గ్రూప్‌తో తమకు సంబంధాలు లేవని పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.