మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు ముగియడంతోపాటు రేపు ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం కీలక నియామకాలు చేపట్టింది. ఎన్నికల అనంతర వ్యూహాలు, పొత్తులను కూడగట్టడంపై ఆ రెండు రాష్ట్రాలకు ఏఐసీసీ పరిశీలకులను నియమించింది. మహారాష్ట్రలో సీనియర్ నేతలు అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘెల్, డాక్టర్ జి పరమేశ్వర, జార్ఖండ్ పరిశీలకులుగా తారిఖ్ అన్వర్, మల్లు భట్టి విక్రమార్క, కృష్ణ అల్లవరును నియమించారు.