మణిపుర్లో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో కేంద్రం మరో 90 కంపెనీల కేంద్ర బలగాలను పంపిచనున్నట్లు సమాచారం. ఇటీవల 5వేల మందిని పంపిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. సున్నితమైన ప్రాంతాల్లో అధికారులు కేంద్ర బలగాలను మోహరింపజేస్తున్నారు. గతేడాది మే 3 నుంచి ఇప్పటివరకు 258 మంది మృతి చెందినట్లు రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్ వెల్లడించారు.