ప్రకాశం: పీఏసీ చరిత్రలో ఇవాళ చీకటి రోజుగా నిలిచిందని, ప్రతిపక్షానికి రావాల్సిన పీఏసీ పదవిని రాకుండా అడ్డుకున్నారంటూ ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ప్రభుత్వం చేసే ఖర్చులపై పీఏసీ నిఘా ఉంటుందనే ఇలాంటి కుట్ర చేశారన్నారు.