ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఏడు ఉచిత హామీలను ప్రకటించారు. ఉచితంగా విద్యుత్, నీరు, విద్య, మొహల్లా క్లినిక్లలో చికిత్స, మహిళలకు బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. వయోవృద్ధుల తీర్థయాత్రలకు ఆర్థికసాయం, ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళకు ప్రతినెలా రూ.1,000 అందిస్తామన్నారు. ఈ ఉచితాలను కేజ్రీవాల్ ‘రేవ్డీ’లుగా అభివర్ణించారు.