AP: శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిపై టీడీపీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగత పనుల వల్ల అసెంబ్లీ కమిటీల పోలింగ్‌కు ఆమె గైర్హాజరైంది. తప్పనిసరిగా రావాలని చెప్పినా రాకపోవడంపై అధిష్ఠానం వివరణ కోరింది. వీసా రెన్యువల్ వల్ల రాలేకపోయానని ఎమ్మెల్యే వివరణ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే పార్టీ నిర్ణయం కంటే ఏదీ ముఖ్యం కాదని అధిష్ఠానం స్పష్టం చేసింది. ఇలాంటివి మరోసారి జరగకూడదని హెచ్చరించింది.