చలికాలంలో లభించే ఆహార పదార్థాల్లో తేగలు ఒకటి. వీటిలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి. ఈ తేగలు బ్లడ్ క్యాన్సర్‌ను అడ్డుకోవడంలో సహాయపడుతాయి. వీటిని తరుచూ తినడం వల్ల ఆరోగ్య సమస్యలు దరిచేరవు. వీటిలో ఎక్కువగా పొటాషియం, విటమిన్ సి, బి3, బి1, బి2, ఒమేగా 3 ఫ్యాటీ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉండటంతో జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చూస్తుంది.