AP: తిరుమల లడ్డూలో వాడిన కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ విచారణ ప్రారంభించింది. తిరుపతి, తిరుమలలో సిట్ బృందం పర్యటించింది. సిట్ కోసం తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేశారు. కల్తీ నెయ్యి కేసుపై పూర్తిస్థాయి విచారణ చేసి సీబీఐ డైరెక్టర్‌కు నివేదిక ఇవ్వనుంది. నాలుగు బృందాలుగా ఏర్పడి ఈ కేసుపై విచారణ చేయనున్నారు. ఈ క్రమంలో నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ ఫుడ్స్‌ను పరిశీలించనున్నారు.