NLR: నందిపాడు – నందవరం రోడ్డు గుంతలకు వేసిన తారు నెలన్నరకే లేచిపోయింది. లక్షల రూపాయలు వెచ్చించి చేపట్టిన రోడ్డు మరమ్మత్తుల పనులు నాసిరకంగా ఉండడంతో తారు పోయి రాళ్లు బయటికి వచ్చాయి. దీంతో ఆ వైపుగా వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. చిన్న మాచునూరు వద్ద రోడ్డు మరింత అధ్వానంగా తయారయింది.