రాజస్థాన్లో వింత ఘటన చోటు చేసుకుంది. 25 ఏళ్ల బధిరుడు చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో సదరు యువకుడికి అంత్యక్రియలు చేసేందుకు చితిపై పెట్టారు. ఉన్నపళంగా లేవడంతో స్థానికులంతా ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స చేస్తున్న కొన్ని గంటలకే తుది శ్వాస విడిచాడు. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని చనిపోనట్లు ప్రకటించడంతో ముగ్గురు వైద్యులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.