మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు నగదు పంపిణీ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న BJP నేత వినోద్ తావ్డే, కాంగ్రెస్ నేతలు ఖర్గే, సుప్రియా శ్రీనాట్, రాహుల్ గాంధీకి లీగల్ నోటీసులు పంపారు. క్షమాపణలు చెప్పాలని, లేకుంటే రూ.100 కోట్ల పరువు నష్టం నోటీసులు ఎదుర్కోవాలన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు బీజేపీ నేత రూ.5 కోట్లు పంపిణీ చేశారని బీవీఏ నాయకుడు హితేంద్ర ఠాకూర్ ఆరోపించిన నేపథ్యంలో తావ్డేకు లీగల్ నోటీసు వచ్చింది.