AP: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డి కస్టడీపై విచారణ మరోసారి వాయిదా పడింది. విచారణను ఈనెల 26కు కడప కోర్టు వాయిదా వేసింది. పులివెందుల పోలీసులు రవీందర్‌రెడ్డిని 10 రోజులపాలు కస్టడీకి ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఆయన ఉన్నారు. మరోవైపు ఎంపీ అవినాష్ పీఏ రాఘవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను కడప కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.