NDL: ఆత్మకూరు పట్టణం వైసీపీ కార్యాలయంలో శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో ముఖ్య సమావేశం నిర్వహించారు. రాబోయే స్థానిక ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. పార్టీ, నేను అండగా ఉంటాననీ అధైర్యపడొద్దు అని కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే శిల్పా భరోసా ఇచ్చారు.