»Taapsee Pannu Secretly Married Her Boyfriend Mathias Bo
Taapsee pannu: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న తాప్సీ
సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను రహాస్యంగా పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన ప్రియుడు మథియాస్ బోను అతికొద్ది మంది అతిథులు మధ్య వివాహం ఆడినట్లు సమాచారం.
Taapsee Pannu secretly married her boyfriend Mathias Bo
Taapsee pannu: ఈ మధ్య టాలీవుడ్, బాలీవుడ్ అందరు హీరోయిన్లు వరుసగా పెళ్లిల్లు చేసుకుంటున్నారు. లావణ్య త్రిపాఠి, రకుల్ ప్రీత్ సింగ్ ఇద్దరు హీరోయిన్లు తము ప్రేమించిన వారినే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే వరుసలో మరో హీరోయిన్ రెడీ అయిపోయింది. సొట్ట బుగ్గల ఢిల్లీ భామ తాప్సీ పన్ను గురించి తెలిసిందే. ఝుమ్మందినాదం చిత్రంతో వెండితెరకు పరిచయై ఇప్పుడు బాలీవుడ్లో బిజీ అయిపోయింది. తాజాగా తన బోయ్ ఫ్రెండ్ మథియాస్ బో ను పెళ్లాడినట్లు తెలుస్తుంది. దాదాపు పది సంవత్సరాల నుంచి వీరిద్దరు డేటింగ్లో ఉన్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. అయితే తాప్సీ సిక్కు కుటుంబానికి చెందిన యువతి, మథియాస్ క్రిస్టియానిటీకి చెందిన వ్యక్తి. మరీ ఈ రెండు సంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరగినట్లు తెలుస్తుంది. రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్లో మార్చి 23న అతి కొద్ది మంది అతిథుల మద్య వీరు మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు.
తాప్పీ ప్రియుడు మథియాస్ బో(Mathias Bo) డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అని తెలిసిందే. ప్రస్తుతం ఇండియా డబుల్స్ టీమ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. 2012 ఒలింపిక్స్ లో డబుల్స్ లో సిల్వర్ మెడల్ గెలుపొందాడు. 2013లో తాప్సీ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ సమయంలో వీరిమధ్య పరిచయం ఏర్పడింది. ఇద్దరు అభిప్రాయాలు కలవడంతో చాలా కాలంగా డేటింగ్లో ఉన్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం దీనికిి సంబంధించిన వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. దీనిపై తాప్సీ కానీ, మథియాస్ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. చూడాలి మరీ వీరి పెళ్లి ఫోటోలు ఎప్పుడు బయటకు వస్తాయో.