తమిళ స్టార్ హీరో సూర్య తాజా చిత్రం కంగువ త్వరలో విడుదల కానుంది. ఇలాంటి గొప్ప చిత్రంలో నటించే అవకాశం రావడంపై సూర్య ఆసక్తికర కామెంట్స్ చేశారు. అవేంటంటే..
Surya About Kanguva Movie: కంగువ లాంటి గొప్ప చిత్రంలో నటించే అవకాశం రావడం తనకు దక్కడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని తమిళ స్టార్ హీరో సూర్య(Surya) అన్నారు. ఈ సినిమా త్వరలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దీనిలో హీరోయిన్గా దిశా పటానీ, బాబీ డియోల్ నటిస్తున్నారు.
ఈ సినిమా గురించి ముంబైలో కంగువ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో సూర్యతో(Surya) పాటుగా మూటీ టీం కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్య తన సినిమా షూటింగ్ అనుభవాలను పంచుకున్నారు. గొప్ప సినిమాల్లో నటించే అవకాశం అదృష్టవశాత్తూ దక్కుతూ ఉంటుందన్నారు. మన కోరికల్ని ఈ యూనివర్స్ విని అది జరిగేలా చేస్తుందన్నారు. అది కంగువ విషయంలో రుజువైంది అని సూర్య అన్నారు. ఈ కంగువ సినిమా(Kanguva Movie) షూటింగ్ ప్రారంభించినప్పటి నుంచి రోజు రోజుకూ సినిమా మరింత పెద్ద ప్రాజెక్టుగా మారుతూ వచ్చింది. ఇలాంటి ప్రెస్టేజియస్ ప్రాజెక్టు చేయాలని కలలుగన్న మా ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజాకు కృతజ్ఞతలే అంటూ సూర్య చెప్పుకొచ్చారు.
పెద్ద బడ్జెట్ చిత్రంగా నిర్మితమవుతున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. పది భాషల్లో తెరకెక్కుతున్న ‘కంగువ’ త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు.