ఓ భారీ బండరాయి తన ఇంటిలోకి దూసుకు వచ్చిన సమయంలో తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నది ఓ మహిళ. ఈ సంఘటన హవాయిలోని పాలోలో వ్యాలీలో చోటు చేసుకున్నది. ఈ వీడియో చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటి వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియోను అక్కడి జర్నలిస్ట్ ఒకరు పోస్ట్ చేశారు. 17 సెకన్ల ఈ వీడియోలో ఓ మహిళ తన ఇంటిలోపల నడుస్తూ ఉంటుంది. అదే సమయంలో సరిగ్గా ఆమెకు పక్క నుండే భారీ బండరాయి ఇంటిలోపలకు గోడను బద్దలు కొట్టుకొని వస్తుంది. అది ఆమె పక్క నుండే ఇంటిలోకి వచ్చి గోడను కూడా పడగొడుతుంది. మహిళతో పాటు ఆ ఇంటిలో మరో ఇద్దరు ఉన్నారు. ఇందులో మరొకరు మహిళ, ఇంకొకరు పురుషుడు. తన పక్క నుండే బండరాయి దూసుకెళ్లడంతో ఆ మహిళ ఒక్కసారిగా భయాందోళనకు గురవుతుంది.