Anchor Suma : తెలుగు సినీ పరిశ్రమలో ఏ పెద్ద ఫంక్షన్ జరిగినా దానికి వ్యాఖ్యాతగా దాదాపు సుమే ఉంటారు. టాప్ యాంకర్‌గా కొన్నేళ్లుగా చలామణి అవుతున్న ఆమె మార్చి 22న తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. తన మాటలతో మాయచేసి అందరినీ టీవీలకు కట్టిపడేసే శక్తి సుమ మాటలకు ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఇంతటి టాప్ యాంకర్‌కి(ANCHOR) కూడా ఓ సాటి యాంకర్ని చూస్తే అసూయగా ఉంటుందట.
ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో సుమ(SUMA) తన మనసులోని భావాలను సరదాగా పంచుకున్నారు. స్టార్ యాంకర్ అయిన సుమకు సాటి యాంకర్ అనసూయను(anasuya) చూస్తే జలసీగా అనిపించిందట. ఈర్ష్య ఉండని వ్యక్తులు ఉండరని ఆమె సరదాగా అన్నారు. అనసూయ అంత ఎత్తు తాను ఎందుకు లేనని అనిపించిందన్నారు. అది అమ్మాయిలకు స్వతహాగా వచ్చే కుళ్లు అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చారు.
సుమ కాలేజ్‌లో వచ్చిన ఫస్ట్ ప్రపోజల్ గురించి కూడా మాట్లాడారు. ఓ కుర్రాడు తనకు లవ్ లెటర్ ఇచ్చిన విషయాన్ని చెప్పుకొచ్చారు. అతడు సైన్స్ స్టూడెంట్ కావడం వల్ల లవ్ లెటర్ని కూడా అవే పదాలతో రాసాడని గుర్తు చేసుకున్నారు. దానిలో ‘నీ ప్రేమ నన్ను గురుత్వాకర్షణ శక్తిలా లాగుతోంది’ అంటూ రాసిన విషయం చెప్పి నవ్వుకున్నారు. అయితే ఆ తర్వాత ఆ అబ్బాయిని తాను అన్నయ్య అని పిలిచానంటూ చెప్పుకొచ్చారు. అమ్మాయిల దగ్గర ఉండే పెద్ద అస్త్రం అదే అంటూ హాయిగా నవ్వేశారు.