»Japans Private Kairoz Rocket Exploded Moments After Launch Video Goes Viral
Kairoz Rocket: లాంచ్ అయిన క్షణాల్లో పేలిన జపాన్ ప్రైవేట్ రాకెట్.. వీడియో వైరల్
జపాన్ ప్రయోగించిన తొలి ప్రైవేట్ రాకెట్ విఫలం అయింది. లాంచ్ అయిన కొన్ని క్షణాల్లోనే పేలిపోయింది. దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
Japan's private Kairoz rocket exploded moments after launch.. Video goes viral
Kairoz Rocket: జపాన్ ప్రయోగించిన తొలి ప్రైవేట్ రాకెట్ పేలిపోయింది. లాంచ్ చేసిన కొన్ని క్షణాల్లోనే అది ధ్వంసం అయింది. రాకెట్ శకలాలు అన్నీ గాల్లో ఎగిసిపడ్డాయి. ఈ ఘటన పశ్చిమ జపాన్‌లోని వకయమ ప్రిఫిక్చర్‌లోని లాంచ్ ప్యాడ్‌లో చోటు చేసుకుంది. బుధవారం 60 అడుగుల ఈ రాకెట్ చిన్న ప్రభుత్వ ఉపగ్రహాన్ని తీసుకొని నింగిలోకి ఎగిరింది. కానీ దురదృష్టవశాత్తు గాల్లో ఎగిసిన కొన్ని క్షణాల్లోనే పేలి ఆగ్నిగోళంలా మారింది. రాకెట్ శకలాలన్ని అక్కడి పర్వతాల మీద పడ్డాయి. దీంతో లాంచ్ ప్యాడ్ ఏరియా మొత్తం నల్లటి పొగ కమ్ముకుంది. వెంటనే నీటి స్పింకర్లు పనిచేయడం మొదలు పెట్టాయి.
టోక్యోకి చెందిన స్పెస్ వన్ సంస్థ ఈ రాకెట్‌ను తయారు చేసింది. ఈ ప్రయోగం విజయవంతం అయితే స్పెస్‌లోకి రాకెట్‌ను పంపించిన మొదటి ప్రైవేట్ సంస్థగా చరిత్ర సృష్టించేది. అయితే దీనిపై స్పెస్ వన్ సంస్థ స్పందిస్తూ.. విజయవంతంగానే లాంచ్ చేశాము. అయితే ప్రయోగాన్ని మధ్యలో ఆపేయాలనే నిర్ణయంతో దాన్ని పేల్చినట్లు చెప్పారు. కానీ అసలు కారణం ఏంటో వెల్లడించలేదు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే ఉపగ్రహ కక్ష్యలోకి వేగంగా పంపిన రాకెట్‌గా ఈ సంస్థకు మంచి పేరు వచ్చేది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
Ouch the first Kairos rocket in Japan just, exploded after about 5 seconds. 😬 The launch site at first glance seems ok… I think. pic.twitter.com/mddZrPgJ1e