AP Politics: ఏపీలో ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు
పార్టీ మారిన ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడింది. వైసీపీ పార్టీలో ఎమ్మెల్సీలుగా గెలిచి టీడీపీ, జనసేన పార్టీలో చేరినందుకు శాసన మండలి ఛైర్మెన్ అనర్హత వేటు వేశారు.
AP Politics: ఆంధ్రప్రదేశ్(Andrapradesh)లో ఇద్దరు ఎమ్మెల్సీలపై శాసనమండలి ఛైర్మన్ అనర్హత వేటు వేశారు. ఎమ్మెల్సీ వంశీకృష్ణ(Vamsikrishna), సీ. రామచంద్రయ్య(C. Ramachandraiah)లు ఇటీవల పార్టీ మారిన విషయం తెలిసిందే. వీరిద్దరూ వైసీపీ తరపున ఎమ్మెల్సీలుగా గెలుపొంది.. ఇద్దరూ వైసీపీకి గుడ్ బై చెప్పి పార్టీలు మారారు. వంశీకృష్ణ జనసేనలో చేరగా.. సి.రామచంద్రయ్య టీడీపీలో చేరారు. దీంతో, వీరిపై చర్యలు తీసుకోవాలంటూ శాసనమండలి ఛైర్మన్‌కు, మండలి కార్యదర్శికి మండలిలో చీఫ్ విప్ మేరిగ మురళీధర్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పార్టీ ఫిరాయింపులపై సమగ్ర విచారణ నిర్వహించారు. శాసనమండలి చర్చ అనంతరం ఇద్దరి సభ్యత్వాలపై ఛైర్మన్ మోషేన్ రాజు అనర్హత వేటు వేశారు.