Prabhas: ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లోఫర్ బ్యూటీతో రచ్చ చేస్తున్నాడు. ఇటలీలో కల్కి సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ఇదే విషయాన్ని చెబుతూ.. ప్రభాస్, నాగ్ అశ్విన్, దిశా పటానీతో పాటు మిగతా టెక్నీషియన్స్ అందరూ ఈ సాంగ్ షూట్లో పాల్గొంటున్నట్లు తెలిపారు మేకర్స్. ఇక ఇప్పుడు మరో పిక్ షేర్ చేసి కిక్ ఇచ్చారు. ఫ్లైట్‌లో హాట్ బ్యూటీ దిశా పటానీ.. ప్రభాస్‌ను ఫోటో తీస్తూ కనిపించింది. ఈ ఫోటోను మేకర్స్ షేర్ చేస్తూ.. ‘ఏ డార్లింగ్ పిక్’ ఇటలీ డైరీస్ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. కల్కి సినిమాలో వచ్చే ఈ సాంగ్ రొమాంటిక్ మూడ్‌లో ఉంటుందని అంటున్నారు. ప్రభాస్, దిశా పటానీ డ్యాన్స్‌తో ఇరగదీస్తారని అంటున్నారు. అయితే.. కల్కి ఇటలీ షెడ్యూల్ పూర్తి అయినట్లుగా సమాచారం.
చదవండి:Suhas: భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన సుహాస్.. ఎంతంటే?
ఇదిలా ఉంటే.. కల్కి విషయంలో మాత్రం ఓ చర్చ జరుగుతునే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోను మే 9న కల్కి 2898 ఏడి మూవీని రిలీజ్ చేసి తీరుతామని చెబుతునే ఉన్నారు మేకర్స్. అయినా కూడా అనుకున్న తేదీకి రిలీజ్ అవుతుందా లేదా అని సినీ వర్గాల్లో తెగ చర్చ నడుస్తోంది. ఇంకా కల్కి మూవీ లాస్ట్ స్టేజ్ సీజీ వర్క్ ఫ్రేమ్స్ రావాల్సి ఉందట. ప్రస్తుతం సీజీ వర్క్ ఫ్రేమ్స్ కోసం చిత్ర యూనిట్ వెయిట్ చేస్తోందట. అందుకే.. కల్కి వాయిదా అనే రూమర్స్ వస్తునే ఉన్నాయి. కానీ చిత్ర యూనిట్ మాత్రం మే 9 అనుకున్న తేదీకి వచ్చేస్తున్నామని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. మరి మరోసారి మేకర్స్.. కల్కి రిలీజ్ డేట్ పై సాలిడ్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
చదవండి:Bhima vs Gaami: భీమా vs గామి.. టార్గెట్ ఫిక్స్?