NLG: రాష్ట్రవ్యాప్తంగా మీసేవ సేవల ధరలను ప్రభుత్వం భారీగా పెంచింది. కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం, సవరించిన ఛార్జీలు తక్షణమే అమలులోకి వస్తాయి. ‘ఏ’ కేటగిరీ సేవలు రూ. 62కి, ‘బి’ కేటగిరీ సేవలు రూ. 80కి పెరిగాయి. విద్యుత్ బిల్లుల చెల్లింపులపై కూడా స్లాబుల వారీగా రూ. 4 నుంచి రూ.44 వరకు అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారు.