IPL-2024: ఇండియా మొత్తం ఐపీఎల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఐపీఎల్ అంటే క్రికెట్ అభిమానుల్లో ఎంతటి క్రేజ్ ఉంటుందో తెలిసిందే. ఇక వేసవిలో ఐపీఎల్ అనేది క్రికెట్ ప్రేక్షకులకు పెద్ద కాలక్షేపం. ఐపీఎల్ 17వ సీజన్‌కు మొత్తం సిద్ధం అయింది. మార్చి 22న ఐపీఎల్-2024 టోర్నీ మొదలు కానుంది. స్టార్ స్పోర్ట్స్ చానల్ ఈ సీజన్‌ను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఈ క్రమంలో టాటా ఐపీఎల్-2024 ప్రోమోను విడుదల చేసింది. ఈ యాడ్ వీడియోలో రిషబ్ పంత్, రింకూ సింగ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా కనిపించారు. ఈ ప్రోమో ఎంతగానే ఆకట్టుకుంది.
దేశంలో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. అందుకోసమే ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించలేదు. మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వరకు కేవలం రెండు వారాలకు మాత్రమే షెడ్యూల్ ప్రకటించింది. ఈ వ్యవధిలో 21 మ్యాచ్ లు నిర్వహించనున్నారు. ఎన్నికల తరువాత పూర్తి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం క్రికెట్ అభిమానులు ఈ ప్రోమోను ఎంజాయ్ చేస్తున్నారు.