»Nita Ambani Tell Me What Is Strange About Anant Ambanis Wedding
Nita Ambani: తన కుమారుడి పెళ్లిలో ప్రతేకలు ఏంటో చెప్పిన నీతా అంబానీ
భారతదేశ కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడిపెళ్లి సంబరాలు అంబరాన్ని అంటాయి. అతిరథ మహారధులు ఈ వివాహానికి హాజరు అవుతున్నారు. ఈ సందర్భంగా తన కుమారుడి పెళ్లితో తనకు ఉన్న రెండు కోరికలను తీర్చుకుంటున్న అని నీతా అంబానీ చెప్పారు. ఇంతకీ తన రెండు కోరికలకు ఏంటో వీడియో రూపంలో పంచుకుంది.
Nita Ambani tell me what is strange about Anant Ambani's wedding
Nita Ambani: భారతదేశ కుబేరుడు ముఖేశ్(Mukesh Ambhani) అంబానీ, నీతా అంబానీ(Nita Ambani)ల రెండవ తనయుడు అనంత్ అంబానీ పెళ్లి సందడి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తన ప్రీ వెడ్డింగ్ వేడులను గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరుపుకుంటున్నారు. ఎన్కోర్ హెల్త్‌కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక పెళ్లి కూతురు. ఈ వేడుకకు ప్రపంచ నలుమూలల నుంచి అతిరథ మహారధులు వస్తున్నారు. సినీ తారలు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులతో జామ్ నగర్లో సందడి నెలకొంది. ప్రపంచ కుబేరుడు అయిన బిల్ గెట్స్, మెటా అధినేత మార్క్ జుకర్ మర్గ్ కూడా ఈ వేడుకకు హాజరు కావడం విశేషం. అతిథుల కోసం ఎయిర్పోర్ట్ నుంచే స్వాగత తోరణాలను కట్టి వారిని ఆహ్వానించారు అంబానీ దంపతులు.
అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ వేడుక ముంబాయిలో కాకుండా గుజరాత్లో జరగడం వెనుక అంతర్యం ఏంటని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. దీనిపై ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. తమ చిన్న కుమారుడు అనంత్ – రాధికల విహహం ఎంతో అట్టహాసంగా జరుగుతుందని, ఆహ్వానించిన బంధువులు అందరూ వస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. అయితే తన కుమారుడి పెళ్లి విషయంలో తనకు రెండు కోరికలు ఉన్నాయని.. మొదటిది.. మన మూలాలను గుర్తుంచుకునేలా వివాహ వేడుకలను నిర్వహించాలని, రెండోది.. ఈ వేడుకలు మన సంస్కృతి, దేశ వారసత్వం, కళలను ప్రతిబింబించేలా ఉండాలని అనుకున్నట్లు తెలిపారు. అందుకే గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఈ వివాహాన్ని జరిపిస్తున్నట్లు తెలిపారు. జామ్‌నగర్ తమ హృదయాలకు ఎంతో దగ్గరైన ప్రాంతమని, తమ జీవితాలను ఇక్కడ నుంచే మొదలు పెట్టినట్లు వెల్లడించారు.