»A Case Has Been Filed In Hyderabad Against Singer Chinmai For Insulting The Country
singer Chinmai: సింగర్ చిన్మయిపై హైదరాబాద్‌లో కేసు
నటీ అన్నపూర్ణను విమర్శంచిన వీడియోను పోస్ట్ చేసిన చిన్మయిపై గచ్చిబౌలిలో కేసు నమోదు అయింది. దేశాన్ని అవమానపరిచేలా మాట్లాడింది అంటూ హెచ్సీయు విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
A case has been filed in Hyderabad against singer Chinmai for insulting the country
singer Chinmai: వివాదస్పదమైన సింగర్ చిన్మయిపై హైదరాబాద్ గచ్చిబౌలి(Gachibowli)లో కేసు నమోదు అయింది. నటీ అన్నపూర్ణను విమర్శించే క్రమంలో దేశాన్ని అవమానించేలా మాట్లాడిందని హెచ్సీయు విద్యార్థి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీనియర్ నటీ ఆడవాళ్లకు అర్థరాత్రి స్వాతంత్య్రం ఎందుకు అని, మగవాళ్లు ఏదోటి అనేలా మనమే అవకాశాన్ని మన ఆహార్యం రూపంలో కల్పిస్తున్నామని ఓ షోలో పేర్కొంది. ఆ వీడియోను జతచేస్తూ చిన్మయి స్పందించింది. మగవాళ్ల బుద్ది మార్చుకోమనల్సింది పోయి, ఆడపిల్లల డ్రెస్ గురించి చెప్పడం అవమానం, ఈవిడే కాదు మన దేశం మొత్తం అలాగే ఉంది. ఈ దేశంలో పుట్టడమే మన కర్మ అని మాట్లాడింది.
దీనిపై ఓ బాధ్యతగల పౌరురాలిగా, సింగర్‌గా పేరున్న ప్రముఖ సింగర్ చిన్మయి( Chinmai) శ్రీపాద దేశాన్ని అవమానపరిచేలా మాట్లాడింది అని హెచ్‌సీ విద్యార్థి కుమార్ సాగర్ ఫిర్యాదు చేశాడు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో కూడా ఈ సింగర్‌పై పలు కేసులు నమోదు అయ్యాయి.