AP: రాజమండ్రి జిల్లా చౌడేశ్వరినగర్‌కు ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండ్యన్ చేరుకుని మెడికల్ క్యాంప్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘కల్తీ పాల ఘటనలో నలుగురు మృతి చెందగా.. 12 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మొత్తం 126 కుటుంబాలకు వ్యాపారి పాలు పోశాడు. ఇప్పటికే పాలు, పెరుగు, రక్త నమూనాలు సేకరించాము. ఈ ఘటనపై CM చంద్రబాబు సమీక్ష జరిపారు’ అని తెలిపారు.