»Is Ntr Koratala Shiva Devara Late Because Of Anirudh
Devara : ‘దేవర’ ఇలా కావడానికి కారణం అతనేనా?
దేవర సినిమా పూజా కార్యక్రమాలు పూర్తవడమే లేట్ అన్నట్టుగా.. జెట్ స్పీడ్‌లో షూటింగ్ చేశాడు కొరటాల. అయినా కూడా ఏప్రిల్ 5 నుంచి పోస్ట్ పోన్ అయింది. దీనికి కారణం అతనే అంటూ.. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
Is NTR Koratala Shiva Devara late because of Anirudh?
Devara: ప్రస్తుతం టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అంటే, మాగ్జిమమ్ అనిరుధ్ పేరే చెబుతారు. ఎందుకంటే జైలర్ లాంటి సినిమా హిట్ అయిందంటే.. అనిరుధ్ ఇచ్చిన బీజిఎం వల్లేనని చెప్పాలి. ఒక్క జైలర్ సినిమానే కాదు.. అంతకుముందు విక్రమ్ సినిమాతో పీక్స్ అనేలా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఇలా చెప్పుకుంటు పోతే.. చివరగా వచ్చిన జవాన్ వరకు అనిరుధ్ ఇచ్చిన సినిమాల ఆల్బమ్స్ అండ్ బీజిఎం నెక్స్ట్ లెవల్ అనేలా ఉంటున్నాయి. అంతేకాదు.. ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్‌లలో అనిరుధ్ రెమ్యూనరేషనే టాప్ అనే టాక్ ఉంది. అనిరుధ్ ఏదైనా సినిమా చేస్తున్నాడు అంటే, మ్యూజిక్ పై భారీ ఆశలు పెట్టుకుంటున్నారు. దేవర విషయంలో కూడా అనిరుధ్ ఫైనల్ అయ్యాడనే అనౌన్స్మెంట్ రాగానే.. ఎగిరి గంతేశారు నందమూరి ఫ్యాన్స్.
ఇక టీజర్ చూసిన తర్వాత అనిరుధ్ దెబ్బకు థియేటర్ టాపులు లేచిపోవడం పక్కా అని మరింత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ.. అసలు అనిరుధ్ వల్లే దేవర డిలే అవుతుందనే విషయమే ఇప్పుడు టైగర్ ఫ్యాన్స్‌కు కాస్త డిసప్పాయింట్ కలిగిస్తోంది. అక్టోబర్ 10న కూడా దేవర వస్తుందా? రాదా? అనే అనుమానాలను కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దేవర సినిమా కోసం అనిరుధ్ ఇంకా పూర్తి స్థాయిలో వర్క్ మొదలు పెట్టలేదట. దేవరతో పాటు అనిరుద్ చేతిలో ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి.. ఇప్పట్లో దేవర మ్యూజిక్ సిట్టింగ్ కంప్లీట్ అయ్యేలా లేదట. కొరటాల కూడా ఈ విషయంలో కాస్త ఒత్తిడికి లోనవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దేవర టీమ్ అనిరుధ్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా సమాచారం. ఏదేమైనా.. అనిరుధ్ మాత్రం కొరటాలను ఇబ్బంది పెడుతున్నట్టుగానే ఉంది వ్యవహారం.