MP Raghu Rama Krishna Raju: ఆంధ్రపదేశ్ సీఎం వైఎస్ జగన్పై ఎంపీ రఘురామ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. విజయవాడ, విశాఖపట్నంలో రెండు హెలికాప్టర్లను పెట్టాలని ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదే విషయాన్ని రఘురామ ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేయనున్న ఆ హెలికాప్టర్లను ఎన్నికల సమయంలో సీఎం జగన్ వినియోగించనున్నారనే వార్తల నేపథ్యంలో ఈసీకి ఫిర్యాదు చేశారు. అదే జరిగితే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లే అవుతుందని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. వ్యక్తిగత భద్రత పేరుతో తెచ్చిన రెండు హెలికాప్టర్లను ఎన్నికల ప్రచారం చేసుకోవడానికే ఈ విధమైన ఏర్పాట్లు చేసుకున్నారని రఘురామ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఈసీని కోరారు.