ప్రముఖ నేపథ్య గాయకుడు కైలాశ్ ఖేర్‌పై దాడి జరిగింది. ఓ వ్యక్తి అతనిపై బాటిల్ విసిరేశాడు. ఈ ఘటన కర్ణాటకలో గల హంపీలో జరిగింది. సంగీత కచేరి నిర్వహిస్తోండగా భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. ఇంతలో ఒకతను దాడి చేశాడు. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
హంపీలో సంగీత ప్రదర్శన ఇస్తుండగా.. కొందరు యువకులు అతి చేశారు. వేదిపై కైలాశ్ ఖేర్ పాటలు పాడుతుండగా.. ప్రేక్షకుల గ్యాలరీ నుంచి యువకులు వాటర్ బాటిల్ విసిరారు. అది సమీపంలో పడింది. తన ప్రదర్శనను ఖేర్ కొనసాగించారు. క్షణాల్లో ఆ బాటిల్‌ను స్టేజ్‌పై నుంచి తొలగించారు.
‘హంపి ఉత్సవ్’ గత శుక్రవారం ప్రారంభం కాగా ఆదివారం ముగిసింది. ముగింపు సందర్భంగా కైలాశ్ ఖేర్ సంగీత విభావరి ఏర్పాటు చేశారు. హిందీ పాటలే పాడటంతో వివాదానికి కారణమైంది. కన్నడ పాటలు పాడలేదనే ఆగ్రహంతో యువకులు బాటిల్ విసిరారని పోలీసులు చెప్పారు. ప్రదీప్, సురా అనే ఇద్దరు యువకులను అరెస్టు చేశామని చెప్పారు.
హిందీతోపాటు దక్షిణాది చిత్రాల్లో కైలాశ్ ఖేర్ హిట్ పాటలు పాడారు. తెలుగులో పరుగు, మిర్చి, భరత్ అనే నేను, బాహుబలి హిందీ, తమిళ్ వర్షన్స్‌లో పాటలు పాడారు.