Ant Chutney : చీమల చట్నీ తిన్న యువతి.. వీడియో వైరల్
బస్తర్ ప్రాంతంలో విద్యా రవిశంకర్ ఒక వింత వంటకాన్ని రుచి చూశారు. చీమలతో చేసిన చట్నీ(Ant Chutney)ని ఆమె తన వీడియో ద్వారా అందరికీ పరిచయం చేశారు. చీమల చట్నీ(Ant Chutney) గురించి తెలిసినవారు కచ్చితంగా ఆశ్చర్యపోతుంటారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఓ తెగకు చెందిన ప్రజలు ఈ చీమలతో చేసిన చట్నీ(Ant Chutney)ని తినడం ఆనవాయితీ.
సోషల్ మీడియా(Social Media) వచ్చాక ప్రపంచంలో ఎక్కడ జరిగిన వింతలూ విశేషాలన్నీ క్షణంలో వైరల్(Viral) అవుతున్నాయి. నెట్టింట అనేక రకాల వీడియోలు వైరల్ అవుతున్నప్పటికీ ఫుడ్ వీడియో(Food videos)లకు ఎక్కువగా వ్యూస్ వస్తుంటాయి. ఫుడ్ వీడియోలలో ముఖ్యంగా స్థానిక రుచులు, వంట ప్రయోగాలు, కొత్త కొత్త వంటల వీడియోలు వైరల్(Video Viral) అవుతుంటాయి. ప్రపంచానికి అన్ని ప్రాంతాల వంటకాలను ఫుడ్ వ్లాగర్స్(Food Vlogers) పరిచయం చేస్తుంటారు. అలా వారు పాపులర్ అవుతుంటారు. ఈ కోవకు చెందిన యువతే విద్యా రవిశంకర్. ప్రస్తుతం ఈ యువ వ్లాగర్ ఛత్తీస్గఢ్ లోని బస్తర్ ప్రాంతంలో ప్రయాణిస్తోంది.
చీమలతో చేసిన చట్నీని తింటున్న యువతి వీడియో:
బస్తర్ ప్రాంతంలో విద్యా రవిశంకర్ ఒక వింత వంటకాన్ని రుచి చూశారు. చీమలతో చేసిన చట్నీ(Ant Chutney)ని ఆమె తన వీడియో ద్వారా అందరికీ పరిచయం చేశారు. చీమల చట్నీ(Ant Chutney) గురించి తెలిసినవారు కచ్చితంగా ఆశ్చర్యపోతుంటారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఓ తెగకు చెందిన ప్రజలు ఈ చీమలతో చేసిన చట్నీ(Ant Chutney)ని తినడం ఆనవాయితీ.
అక్కడి ప్రజలు గూళ్లు ఉన్న చెట్ల నుంచి చీమ(Ants)లను వేరు చేస్తారు. ఆ తర్వాత ఆ చీమలను దంచి ప్రత్యేకంగా చట్నీ(Chutney)ని రెడీ చేస్తారు. విద్యా రవిశంకర్ ఆ చీమల చట్నీ(Ant Chutney)ని రుచి చూసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది. ఆ వీడియోను చూడలేమని కొందరు కామెంట్ చేస్తుంటే మరికొందరు మాత్రం విద్యా రవిశంకర్ ను ప్రశంసిస్తున్నారు. చీమల చట్నీ కొందరికి వింతగా ఉన్నప్పటికీ దానిని ఎవ్వరూ ప్రయత్నించవద్దని మరికొందరు సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్(Viral) అవుతోంది.