ఓ ఐటీ కంపెనీ ట్రైనర్‌ను ఏర్పాటు చేసి మరీ భాంగ్రా డ్యాన్స్ చేయించింది. ఉద్యోగుల మూడ్ మార్చడంతోపాటు ఫిట్ నెస్ కల్పించడం కోసం ఇలా చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతుంది.
Bhangra Dance in office: బిజీ లైఫ్‌లో స్ట్రెస్ నుంచి రిలీఫ్ పొందాలి.. లేదంటే ఒత్తిడికి గురవుతుంటారు. అందుకే సాప్ట్ వేర్ కంపెనీల్లో ఎంప్లాయీస్ స్ట్రెస్ ఫ్రీ గురించి ఆలోచిస్తాయి. అందుకోసం కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. అప్పుడప్పుడు ఉత్సాహ పరిచే ఆట, పాటలు నిర్వహిస్తారు. కొన్ని కంపెనీలు అయితే ప్రొఫెషనర్ల డ్యాన్సర్లను ఏర్పాటు చేసి.. స్టెప్పులు వేయిస్తారు. కింద ఉన్న వీడియో అలాంటిదే.. ఓ కంపెనీలో ట్రైనర్.. ఉద్యోగులకు భాంగ్రా డ్యాన్స్ (Bhangra Dance) నేర్పిస్తున్నారు.
ఫిజికల్ యాక్టివిటీ.. చేతులు లేపి, కాళ్లు ఆడిస్తూ.. బాడీని ఊపితే శరీరం ఉత్తేజానికి గురవుతుంది. మూడ్ మారడమే కాదు.. ఫిట్ నెస్ (fitness) కూడా మెరుగుపడుతుంది. కొత్త నైపుణ్యాలను నేర్చుకునేలా ప్రేరెపిస్తోంది. అలా ఓ ట్రైనర్ ఉద్యోగులకు భాంగ్రా డ్యాన్స్ (Bhangra Dance) నేర్పించారు. ఆ వీడియోను ఇన్ స్టలో సాహిల్ శర్మ (sahil sharma) పోస్ట్ చేశారు. ఇంకేముంది తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోకు ఇలా రాసుకొచ్చారు.. తనకు కూడా ఇలాంటి ఆఫీసు (office) ఉంటే బాగుంటుంది. డ్యాన్స్ (dance) చేయమని కోరడంతో ఉద్యోగులు కూడా ఉత్సాహంగా డ్యాన్స్ (dance) చేశారు.
ఆ వీడియోకు నెటిజన్లు (netizens) కామెంట్స్ చేస్తున్నారు. తమ కంపెనీలో ఇది మోస్ట్ హ్యాపెనింగ్ సీజన్ అని ఓ ఉద్యోగి అభిప్రాయ పడ్డారు. డ్యాన్స్ చేయడంతో మంచి ఎనర్జీ వచ్చిందని అంటున్నారు. ఇలా చేయడం వల్ల నిజంగా ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుందని మరొకరు రాశారు. ఎక్కడ అయితే అలాంటి ఆఫీసు ఉంటుందో.. టెన్షన్ (tension) లేకుండా చక్కగా పనిచేసే వీలు కలుగుతుందని మరొకరు రాశారు. తనకు ఇలాంటి ఆఫీసు కావాలని అంటున్నారు.
ఆ వీడియోకు ఇప్పటికే 2.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి. సోషల్ మీడియాలో (social media) తెగ షేర్ అవుతోంది. కామెంట్లతో బాక్స్ నిండిపోతుంది. నిజమే ఐటీ కంపెనీలు ఆలోచన.. ఉద్యోగుల నుంచి పని తీసుకోవడం.. ఒత్తిడి లేకుండా పనిచేయాలని కోరుకుంటారు. అందుకోసమే ఇలాంటి ఈవెంట్స్ నిర్వహించి.. ఉద్యోగులను ఉత్సాహ పరుస్తారు.