»Who Is A Bigger Star Currently Virat Kohli Or Shahrukh Khan
Virat Kohli Vs Shahrukh Khan: కోహ్లీ-షారుక్ లలో ఎవరు పెద్ద స్టార్!
సోషల్ మీడియాలో క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ (cricketer virat kohli), బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ (bollywood shahrukh khan) అభిమానుల మధ్య (fan war) మాటల యుద్ధం నడుస్తోంది. తమ వాడు గ్రేట్ అంట తమ వాడు గ్రేట్ అంటున్నారు.
సోషల్ మీడియాలో క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ (cricketer virat kohli), బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ (bollywood shahrukh khan) అభిమానుల మధ్య (fan war) మాటల యుద్ధం నడుస్తోంది. తమ వాడు గ్రేట్ అంట తమ వాడు గ్రేట్ అంటున్నారు. ట్విట్టర్ లో షారుక్ ఖాన్ పైన ‘హక్లా’ హ్యాష్ ట్యాగ్ తో (Hakla) సెటైర్లు వేస్తున్నారు. ఇది టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. కోహ్లీ, షారుక్ లకు భారత్ లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరు భిన్నమైన రంగాలకు చెందినవారు. వాస్తవానికి ఒకరితో ఒకరిని పోల్చలేం. కానీ వీరిద్దరి మధ్య ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది, ఎవరు గొప్ప అంటూ సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది ఇరువురు అభిమానుల మధ్య. వీరి మధ్య ఒకే ఒకే సంబంధం ఉంది. కోహ్లీ క్రికెటర్ కాగా… షారుక్ ఖాన్ ఎప్పుడు క్రికెట్ ఆడింది లేదు.. కానీ ఐపీఎల్ కోల్ కతా నైట్ రైడర్స్ యజమాని. అలాగే కోహ్లీ సతీమణి అనుష్క శర్మ బాలీవుడ్ నటి.
గతంలో సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్, అలాగే సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ తదితర అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ పలు సందర్భాల్లో జరిగింది. కానీ ఇప్పుడు బాలీవుడ్ హీరోను, క్రికెటర్ దిగ్గజాన్ని పోల్చడం విరుద్ధమైన అంశం. ఇరువురి అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ క్రికెటర్ లేదా నటుడిని పొగుడుతూ.. మరొకరి పైన విమర్శలు గుప్పిస్తున్నారు.
విరాట్ కోహ్లీ భారత్ ను తలెత్తుకునేలా చేశాడని, షారుక్ ఖాన్ అలా కాదంటూ నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. ఒకరు పోల్ పెట్టగా విరాట్ కోహ్లీకి 55 శాతం, షారుక్ ఖాన్ కు 45 శాతం ఓట్లు వచ్చాయి. షారుక్ ది గత పదేళ్లలో ఒక సినిమా మాత్రమే హిట్ అయిందని, షారుక్ తనయుడు డ్రగ్గిస్ట్ అని, అతని భార్య బెర్లిన్ విమానాశ్రయంలో డ్రగ్స్ తో పట్టుబడిందని, అరబ్ కంట్రీలలో తప్పితే పెద్దగా తెలియదని కోహ్లీ అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. షారుక్ ఖాన్ కు ట్విట్టర్ ఖాతాలో 36.9 మిలియన్ల అభిమానులు ఉండగా, కోహ్లీకి 242 మిలియన్లు ఉన్నారని గుర్తు చేస్తున్నారు. ఎలాంటి అనుమానం లేకుండా షారుక్ కంటే కోహ్లీ పెద్ద స్టార్ అని నెటిజన్లు ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. మరో షారుక్ అభిమాని… విదేశాల్లో క్రికెట్ కంటే, సినిమాలకు ఆదరణ ఎక్కువ అని, కాబట్టి షారుక్ గ్రేట్ స్టార్ అంటున్నారు. మొత్తానికి భిన్న రంగాలకు చెందిన కోహ్లీ – షారుక్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ రెండు రోజులుగా చర్చనీయాంశంగా మారింది.