Viral Video: సమాజంలో మానవత్వం లేకుండా పోతుంది. తల్లితో సమానమైన అత్తను కనీసం గౌరవించడం లేదు. ఇక కొందరు కోడళ్లు దాడికి పాల్పడుతున్నారు. ఓ వృద్ధురాలైన అత్తను దారుణంగా కొట్టిన వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది. నెటిజన్లు ఆ కోడలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నిందితురాలిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే ఆ నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.
Abuse of elderly is increasing so much in society. Such treatment is sick to say the least. This woman should be arrested if she hasn't already been. What's really disturbing is how she's training even the child to abuse the old lady. Kindly tag policehttps://t.co/kWI1ysNrb9
కేరళ కొల్లామ్ జిల్లాలో ఓ వృద్ధురాలైన అత్త ఇంటి బయట నుంచి మెల్లగా నడుచుకుంటూ వచ్చి హాల్లో ఉన్న మంచంపై కూర్చుంది. ఇలా కూర్చుని టీవీ చూస్తున్న అత్తను మంచం మీద కూర్చోవద్దు.. టీవీ చూడవద్దని కోడలు కోపగించుకుంది. అయిన అత్త కూర్చుని టీవీ చూడటంతో ఆగ్రహించుకున్న కోడలు అత్తను వెనుక నుంచి బలంగా తోసేసింది. దీంతో వృద్ధురాలు ఒక్కసారిగా బోర్లా పడింది. కష్టంగా లేచిన ఆ వృద్ధురాలు నొప్పి అంటూ అక్కడే కూర్చుని ఉండిపోయింది. దీనిని బెడ్ రూమ్లో ఉన్న వ్యక్తి తన మొబైల్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా వైరల్ అయ్యింది. అరెస్ట్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేయడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.