Viral News: ఎండ బాధ తట్టుకోలేక.. ట్ర‌క్ డ్రైవ‌ర్ ఏం చేశాడో చూడండి..వీడియో వైర‌ల్‌!

ఎండ తాపం నుంచి ఉపశమనం పొందడానికి ఓ ట్రక్ డ్రైవర్ వినుత్నమైన ఆలోచన చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

  • Written By:
  • Publish Date - April 25, 2024 / 01:17 PM IST

Viral News: ఎండ‌లు మండిపోతున్నాయి. ఏప్రిల్ నెలలోనే 45 డిగ్రీలు దాటిపోతున్నాయి. ఇక మే నెలలో ఎండలు ఎలా ఉంటాయో అని ప్రజల్లో భయం పట్టుకుంది. ఇళ్లు, ఆఫీసులలో పనిచేసే వారి పరిస్థితియే ఇలా ఉంటే రోడ్ల మీద పని చేసేవారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా ఓ ట్రక్ డ్రైవర్ ఎండ తాపం నుంచి ఉపశమనం పొందడానికి ఓ వినుత్నమైన పని చేశాడు. దీంతో ఆ డ్రైవర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. మాములుగానే ట్రక్స్, లారీలు లాంగ్ డ్రైవ్ ప్రయాణించాల్సి ఉంటుంది. అందులో ఆ వాహనాల్లో ఫ్యాన్ తప్ప ఎయిర్ కండిషనర్లు ఉండవు. అందువల్ల కాస్త క్రియేటీవ్‌గా ఆలోచించిన అతను డ్రైవింగ్ సీటు పక్కనే ఓ వాటర్ బకెట్ పెట్టుకున్నాడు.

చదవండి:Nominations: ఒంటెపై వెళ్లి నామినేషన్‌ వేసిన అభ్యర్థి… వీడియో వైరల్‌

ఇక ఎండలో ప్రయాణం చేస్తున్న డ్రైవర్ ఓ మగ్గుతో నీల్లు మీద పోసుకుంటున్నాడు. ఇది చూడడానికి ఫన్నీగా కనిపించినా ఎండ తీవ్రతకు అద్దం పడుతుంది. ఇదే వీడియోను 45-50 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లో ఓ డ్రైవర్ క‌ష్టం అనే క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్లు పెడుతున్నారు. కొందరు డ్రైవర్‌పై సానుభూతి చూపిస్తున్నారు. మరోకరు రోడ్డు రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీని అడగండి అని, మరోకరు చాలా వేడిగా ఉంది అని కామెంట్లు చేస్తున్నారు. బయట ఎండల పరిస్థితి మరీ దారుణంగా ఉండడంతో చేసేది ఏం లేక ఇలా డ్రైవర్ల కష్టం అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Related News

Summer: స్నానం చేసేటప్పుడు బకెట్ నీటిలో ఇది కలిపితే.. ఆ సమస్యలన్నీ మటుమాయం..!

వేసవిలో ఎక్కువగా చెమట పట్టడం, వేడి వాతావరణం కారణంగా చర్మంపై దద్దుర్లు, దురద, చర్మ సంక్రమణలు వంటి సమస్యలు సర్వసాధారణం. ఈ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి, రసాయనాలు నిండిన మందులకు బదులుగా సహజ పద్ధతులను ఉపయోగించడం మంచిది.