బరువు తగ్గాలని అనుకునే వారు వేసవిలో వాకింగ్, వ్యాయామాలు ఎక్కువగా చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. అయితే వేసవిలో ఏ కాలంలో నడవడం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందొచ్చో తెలుసుకుందాం రండి.
Evening Walk Benefits In Summer : చాలా మంది ఉదయమే వాకింగ్ చేస్తూ ఉంటారు. అయితే వేసవి కాలంలో మాత్రం సాయంత్రం పూట నడవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా సాయంత్రపు నడక వల్ల కండరాలు బలపడతాయి. బరువు నియంత్రణలో ఉంటుంది. కొలస్ట్రాల్ స్థాయిలు తగ్గి బరువు తగినంతగా మెయింటెన్ చేయడానికి సహకరిస్తుంది. ఇంకా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
వేసవి కాలంలో(summer) సాయంత్రం ఐదు, ఐదున్నర అయితేగాని బయట చల్లబడదు. కాబట్టి ఆ తర్వాత మాత్రమే వాకింగ్ చేయడం ఉత్తమం. అరగంట నుంచి 45 నిమిషాల పాటు నడవడం మంచిది. ఇలా చేసిన తర్వాత ఓపికున్న వారు వర్కవుట్స్ కూడా చేసుకోవచ్చు. ఇలా సాయంత్రపు నడక వల్ల ఒత్తిడి తగ్గుతుంది. నిద్ర పట్టలేని వారికి ఇది చక్కని మందులా పని చేస్తుంది.
సాయంత్రం నడవడం( walking) వల్ల శరీర ఉష్ణోగ్రతను అది మెరుగ్గా రెగ్యులేట్ చేసుకుంటుంది. అందువల్ల రిలాక్సింగ్‌గా అనిపిస్తుంది. వేడి సంబంధంగా వచ్చే జబ్బులేమీ రాకుండా ఉంటాయి. ఈ నడక వల్ల కండరాలు బలం పుంజుకుంటాయి. ఫలితంగా గుండెకు సంబంధించిన వ్యాధులు తక్కువగా వస్తాయి. అలాగే కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌తో కలిసి వాకింగ్ చేయడం వల్ల సామాజిక సంబంధాలు సైతం బలపడతాయి.