Insects : చెవుల్లోకి దూరుతున్న వింత పురుగులు.. ఇళ్లు ఖాళీ చేసి వెళుతున్న ప్రజలు!
ఓ వింత పురుగులు ఇళ్లలోకి చేరి బీభత్సం సృష్టిస్తున్నాయి. చెవుల్లోకి దూరిపోతూ ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దీంతో అక్కడి ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి వేరేచోట్లకి వెళ్లిపోతున్నారు. ఇంతకీ ఇది ఏ ప్రాంతం అంటే?
Strange Insects : అస్సాంలోని తేజ్పూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లుండి వింత పురుగులు దర్శనం ఇస్తున్నాయి. పెద్ద ఎత్తున ఇళ్లలోకి వచ్చి ప్రజల్ని ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. వారి చెవుల్లోకి దూరిపోతున్నాయి. ఇంటా, బయటా ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి. దీంతో వీటి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొందరైతే ఇళ్లను వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.
ఈ పురుగులు(PESTS) ఎక్కడి నుంచి ఎలా వచ్చాయో తమకు తెలియదని స్థానికులు చెబుతున్నారు. ఇంతకు ముందు ఎప్పుడూ వాటిని ఇక్కడ చూడలేదని అంటున్నారు. ఉన్నట్లుండి రెండు మూడు రోజులుగా ఇవి కనిపిస్తున్నాయని వెల్లడించారు. ఇంటి బయట, పొలాల్లోనే కాకుండా ఇళ్లల్లోక్కూడా ఇవి పెద్ద ఎత్తున వచ్చేస్తున్నాయని చెబుతున్నారు. దీంతో ఇప్పుడీ వార్త వైరల్గా మారింది.
ఇంట్లో ఉండే దుస్తులు, మంచాలు, పరుపులు, ఆహారా ధాన్యాల్లోకి ఈ పురుగులు(PESTS) వచ్చేస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. చిన్న పిల్లలు చెవుల్లోనూ దూరిపోతున్నానయని వాపోతున్నారు. పురుగుల మందులు కొట్టినా వీటి సమస్య తగ్గడం లేదని బదులుగా ఇవి మరిన్ని రెట్టింపై కనిపిస్తున్నాయని చెబుతున్నారు. వీటిని అరికట్టకపోతే ఇతర ప్రాంతాలకూ ఇవి విస్తరించిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. దీంతో స్థానికంగా ఉన్న అధికారులు ఈ విషయమై ఏం చేయాలన్న దానిపై తలలు పట్టుకుంటున్నారు.