చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘెల్ (Bhupesh Baghel) మీడియాతో మాట్లాడుతుండగా పాము కలకలం సృష్టించింది. ముఖ్యమంత్రి కాలిపక్కనుంచి పాము వెళ్తుండగా ఆయన భద్రతా సిబ్బంది సహా అక్కడున్న వారు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. దానిని కొట్టి చంపేందుకు వారు ప్రయత్నంచగా సీఎం వారించారు. ఆ స్నేక్ (Snake)విషకారి కాదని, భయపడాల్సిన పనేమీ లేదనీ, దానిని చంపవద్దని సీఎం తెలిపారు. ఇలాంటి పాములు అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటాయని అన్నారు. ప్లాస్టిక్ బ్యాగ్‌లో దానిని పట్టుకుని వేరే జాగాలో విడిచిపెట్టమని అక్కడకు చేరుకున్న అధికారులను ఆదేశించారు.అనంతరం వీడియో కాన్ఫరెన్స్ కొనసాగించారు.
ఈ ఘటనపై నెటిజెన్లు (Netizens) కొందరు సరదా కామెంట్లు చేశారు. నాగపంచమి సందర్భంగా సీఎంను గ్రీట్ చేయడానికి పాము వచ్చిందని కొందరు వ్యాఖ్యానించగా, జంతువుల పట్ల భూపేష్ బఘెల్‌కు ఉన్న ప్రేమను కొందరు అభినందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన అంటే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తారు. ఓ వైపు భద్రతా సిబ్బంది పర్యవేక్షణ, మరోవైపు అనుచరుల హడావుడి ఉంటుంది. అలాంటి చోటుకు ఓ స్నేక్ రావడం కలకలం రేపింది. పక్కన ఉన్నవారు భయపడినప్పటికీ.. సీఎం మాత్రం పామును చంపొద్దని సిబ్బందికి సూచించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు (Comments) చేస్తున్నారు. ‘సీఎంకు నాగపంచమి శుభాకాంక్షలు చెప్పేందుకు పాము వచ్చి ఉంటుందని’ ఒక యూజర్ కామెంట్ చేయగా, ‘జంతువులు, వన్య మృగాలపై సీఎంకు ఉన్న ప్రేమను అభినందిస్తూ’ కామెంట్ చేశారు.