ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ (Prakash Raj) షాకింగ్ కామెంట్స్ చేశారు. చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రాజెక్ట్‌ను ఉద్దేశిస్తూ ఆయన ఎక్స్ (ట్విటర్)లో ఓ పోస్ట్ పెట్టారు. ‘బ్రేకింగ్ న్యూస్.. విక్రమ్ ల్యాండర్ (Vikram Lander) పంపిన తొలి ఫొటో’ అంటూ అందులో పేర్కొన్నారు. అయితే, తన పోస్టులో ప్రకాశ్ రాజ్ ఎక్కడా ప్రధాని మోదీ (PM MODI)పేరు ప్రస్తావించనప్పటికీ.. ఇది ఆయననుద్దేశించి చేసిన పోస్టేనంటూ కొందరు నెటిజన్లు ఆరోపించారు. దీంతో రాజకీయాల కోసం శాస్త్రవేత్తలను అవమానిస్తారా అంటూ కొందరు నెటిజన్లు విమర్శలకు దిగారు. ‘‘చంద్రయాన్- 3 అనేది దేశానికే గర్వకారణం. గుడ్డిగా కొందర్ని వ్యతిరేకించే క్రమంలో మీరు సైంటిస్టులనే అవమానిస్తున్నారు’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘చంద్రయాన్ ప్రాజెక్ట్ (Chandrayaan Project) ఇస్రోకు సంబంధించింది.
బీజేపీ (BJP) ది కాదని. విజయవంతమైతే అది భారత్ విజయం. ఏ ఒక్క పార్టీదో కాదు. మీ రాజకీయాల్లోకి ఇస్రోను లాగొద్దు’’ అని మరో నెటిజన్ విమర్శలు గుప్పించాడు. ‘దేశం కోసం ఏళ్లుగా కష్టపడుతున్న శాస్త్రవేత్త(Scientist)ల మీద మీ విమర్శలు సరికాదు’ అని మరో నెటిజన్ తెలిపారు. మరికొందరు అయితే, ప్రకాష్ రాజ్‌ను మరింత దారుణంగా ట్రోల్ చేశారు. ప్రభుత్వంపై ఉన్న ద్వేషాన్ని ఆయన దేశ శాస్త్రవేత్తలపై చూపిస్తున్నారంటూ, చారిత్రాత్మక మిషన్‌ను అపహాస్యం చేశారంటూ విమర్శించారు. రాజకీయాలకు, దేశాన్ని విమర్శించడానికి మధ్య తేడా ఉందన్న విషయాన్ని ఆయన గుర్తించాలని సూచించారు.బీజేపీపై, ప్రధాని పై గుడ్డి ద్వేషం కారణంగానే ఆయన ఈ పోస్టు చేశారని పలువురు అభిప్రాయపడ్డారు. శాస్త్రవేత్తల కృషిని ఎగతాళి చేసేలా ట్వీట్ చేశాడంటూ విరుచుకుపడ్డారు. చంద్రయాన్-3 దేశానికి గర్వకారణం. అంతేతప్ప.. ప్రకాష్ రాజ్ గుడ్డి ద్వేషానికి సాధనం కాదు అంటూ నెటిజన్లు (Netizens) విరుచుకుపడుతున్నారు.