ఓ రష్యా లేడీ యూట్యూబర్‌ను ఒక భారతీయ యువకుడు ఇబ్బంది పెట్టాడు. నాతో ఫ్రెండ్షిప్ చేయమని అడిగాడు. ఆ మహిళా ఎంత చెప్తున్నా వినకుండా తన వెనుకాలే ఫాలో అయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Indian boy who chased YouTuber Coco in India in Delhi
Viral News: కోకో ఇన్ ఇండియా(Coco in India) పేరిట రష్యాకు చెందిన కోకో క్రిస్ అనే యువతి ఓ యూట్యూబ్ చానల్‌ను పెట్టి వ్లాగ్స్ చేస్తోంది. మనదేశంలోని వివిధ దర్శనీయ స్థలాలను సందర్శిస్తోంది. తాను వీక్షిస్తున్న ప్రదేశాలు, వాటి అనుభవాలను వీడియోల రూపంలో తన సబ్స్క్రైబర్స్తో పంచుకుంటుంది. తన యూట్యూబ్ చానల్‌కు 2.05 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా తన ఛానెల్లో ఒక షార్ట్ అప్లోడ్ చేసింది. తాను ఢిల్లో(in Delhi)ని సరోజినీ నగర్ మార్కెట్లో ప్రయాణిస్తుంది. ఆ సమయంలో ఒక యువకుడు తన వెంట పడ్డాడు. వీడియోలో చూస్తే.. నువ్వు చాలా అందంగా ఉన్నావు, నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా అని అడుగుతాడు. దానికి థ్యాంక్స్ చెప్పి నువ్వు నాకు తెలియదు అంటుంది కోకో. పరిచయం చేసుకుంటే అన్ని తెలుస్తాయి అని మనోడు పులిహోర కలుపుడు మొదలు పెడుతాడు. తన ఛానెల్‌ను ఫాలో అవుతున్నట్లు, తనకు రష్యా అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయాలని ఉందని చెప్తాడు. పనిలో పనిగా నువ్వు చాలా సెక్సీగా ఉన్నావు అంటాడు. దాంతో కోకో అతని నుంచి తప్పించుకొని వెళ్తుంది. దీనికి సంబంధించిన వీడియోను తన ఛానెళ్లో అప్లోడ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇండియాలో ఇలాంటి అనుభవం జరిగినందుకు కోకోకు సారీ చెప్తున్నారు.