Prabhas-Maruti : ‘ప్రభాస్-మారుతి’ ఏం తీసుకోవడం లేదా!?
Prabhas-Maruti : బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేశాయి. సాహో జస్ట్ ఓకే అనిపించినా.. రాధే శ్యామ్ మాత్రం భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. అన్లిమిటెడ్ బడ్జెట్ కారణంగా.. ఈ సినిమాలు గట్టిగానే దెబ్బ తీశాయి. కానీ అప్ కమింగ్ ఫిల్మ్స్ మాత్రం అలా కాదు.. పక్కా ప్లానింగ్, సాలిడ్ కంటెంట్‌తో రాబోతున్నాయి.
బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేశాయి. సాహో జస్ట్ ఓకే అనిపించినా.. రాధే శ్యామ్ మాత్రం భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. అన్లిమిటెడ్ బడ్జెట్ కారణంగా.. ఈ సినిమాలు గట్టిగానే దెబ్బ తీశాయి. కానీ అప్ కమింగ్ ఫిల్మ్స్ మాత్రం అలా కాదు.. పక్కా ప్లానింగ్, సాలిడ్ కంటెంట్‌తో రాబోతున్నాయి. సలార్, ప్రాజెక్ట్ కె, ఆదిపురుష్ భారీ బడ్జెట్, ప్లస్ డిఫరెంట్ జానర్లో తెరకెక్కుతున్నాయి. అయితే వీటి మధ్యలో మారుతితో ఓ చిన్న సినిమా చేస్తున్నాడు డార్లింగ్. పీపుల్స్ మీడియా సంస్థ ఆ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాను లో బడ్జెట్‌తోనే తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌తో సినిమాలు చేయాలంటే.. ఎంత కాదనుకున్నా 200 కోట్లు ఉండాల్సిందే. ప్రభాస్ పారితోషికమే 100 కోట్ల వరకు పోతుంది. కాబట్టి డార్లింగ్ సినిమా అంటే కోట్లకు కోట్లు పెట్టాల్సిందే. కానీ మారుతి సినిమా మాత్రం పరిమిత బడ్జెట్లలోనే తీస్తున్నారు. అసలు ఈ సినిమాకు ప్రభాస్ రెమ్యూనరేషన్ కూడా తీసుకోవడం లేదట. మారుతి కూడా పారితోషికం తీసుకోవడం లేదట. ముందుగానే ఒక బడ్జెట్ అనుకుని.. అందులోనే సినిమా తీసేలా పక్కాగా ముందుకు సాగుతున్నారట. అయితే సినిమా రిలీజ్ అయ్యాక.. లాభాల్లో మాత్రం వాటా తీసుకోబోతున్నాడట ప్రభాస్. ఎలాగు సినిమా బడ్జెట్ తక్కువే.. హంగులు, ఆర్భాటాలు పెద్దగా లేవు.. కాబట్టి మారుతి సినిమా భారీగా లాభాలు తెచ్చిపెడుతుందని అంటున్నారు. ప్రభాస్ క్రేజ్‌తో ఎంత కాదనుకున్నా భారీ బిజినెస్ జరిగే ఛాన్స్ ఉంది. ఇక సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. వసూళ్ల వర్షం కురుస్తుందనడంలో.. ఎలాంటి సందేహాలు లేవు. కాబట్టి.. మారుతి సినిమాకు ఎక్కువగా రిస్క్ లేదనే చెప్పాలి.