‘ఆదిపురుష్’ టీజర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. అక్టోబర్ 2, సాయంత్రం 7 గంటల 11నిమిషాలు రావడానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి. పూర్తి స్థాయిలో ప్రభాస్ రాముడి లుక్ చేసేందుకు తహతహలాడుతున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. అలాగే సోషల్ మీడియాను షేక్ చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటికే ట్విట్టర్ ఆదిపురుష్, ప్రభాస్ పేరుతో మార్మోగిపోతోంది. ఇక ఇప్పుడు టీజర్ నిడివి గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మామూలుగా అయితే ఏ సినిమా టీజర్ తీసుకున్నా.. ఒక నిమిషానికి అటు, ఇటుగానే ఉంటుంది. కానీ దాదాపుగా నిమిషం లోపే ఉంటాయి. అయితే ఆదిపురుష్ టీజర్ మాత్రం అంతకు మించి అనేలా ఉంటుదని తెలుస్తోంది.
ఏకంగా ఈ టీజర్ నిడివి ఒక నిమిషం యాభై సెకన్లు ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది. సాధారణంగా మన సినిమాల ట్రైలర్స్ మాత్రమే రెండు నిమిషాలకు అటు, ఇటుగా రిలీజ్ చేస్తుంటారు. కానీ ఆదిపురుష్ టీజర్ నిడివి కాస్త ఎక్కువగా ఉంటుందని టాక్. ఒకవేళ ఇదే నిజమైతే.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగేనని చెప్పొచ్చు. కానీ ఆదిపురుష్ టీజర్ అంత రన్ టైంతో వచ్చే అవకాశాలు తక్కువేనని చెప్పొచ్చు. అయితే ఇలాంటి డౌట్స్ అన్నీంటికి.. ఇంకొన్ని గంటల్లో చెక్ పడబోతోందని చెప్పొచ్చు. ఇకపోతే.. ఆదిపురుష్‌లో సీత పాత్రలో కృతి సనన్ నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించబోతున్నాడు. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.