ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్(Adipurush) చిత్రంలో పలు సన్నివేశాలు, డైలాగ్స్ వివాదాస్పందంగా మారిన విషయం తెలిసిందే. సోషల్ మీడియోలా ఈ అంశంపై పెద్ద ఎత్తున కామెంట్లు వచ్చిన నేపథ్యంలో ఈ మూవీ డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్(manoj muntashir) స్పందించారు. ఈ చిత్రం ద్వారా ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు శనివారం బహిరంగ క్షమాపణలు(apologized) చెప్పారు.
ఇండియాలో 47 శాతం మంది ఉద్యోగులు(employees) తమ ఉద్యోగాల పట్ల భద్రత లేదని వెల్లడించారు. అయితే సర్వే చేయబడిన 17 దేశాలలో సగటు 38 శాతం కంటే ఇది ఇండియా(india)లోనే ఎక్కువ ఉండటం విశేషం.
ప్రముఖ సంస్థ మెక్‌డొనాల్డ్స్(mcdonald) ఇండియాలోని వివిధ ప్రాంతాల్లోని స్టోర్ లలో తయారు చేస్తున్న బర్గర్‌లలో టమాటా వాడకాన్ని ఆపివేస్తున్నట్లు ప్రకటించారు. అది ఎందుకు? మరి ఏ ప్రాంతాల్లో నిలిపివేశారో ఇప్పుడు చుద్దాం.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడో భార్య గురించి అసభ్యకరంగా ట్వీట్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని, క్షమాపణలు చెప్పకుంటే చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని జనసేన పార్టీ హెచ్చరించింది. అసభ్య పోస్టులు పెట్టిన వారి వివరాలను తెలుపుతూ ట్వీట్ చేసింది.
కర్ణాటక ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన శక్తి యోజన పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించింది. ఈ పథకాన్ని ఆసరాగా తీసుకొని ఒక వ్యక్తి బుర్ఖా ధరించి బస్ స్టాప్ లో పట్టుబడ్డాడు.
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రాంతంలో ఓ పౌరసరఫరాల సంస్థ ఉద్యోగి స్కూటర్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతివేగంతో వస్తున్న కారు స్కూటర్‌పై నుంచి దూసుకెళ్లింది. ఇందులో అతడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డయింది.
ఢిల్లీ మెట్రోలో యువతులు వీరంగం చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. వీడియో చూసిన ప్రజలు ఛీ ఛీ అంటున్నారు.
కేరళలో మరో వింత వ్యాధి స్థానికప్రజలను భయాందోళనకు గురిచేసింది. 2017లో వెలుగు చూసిన ఈ వ్యాధి మళ్లీ ఇన్నాళ్లకు కలకలం సృష్టిస్తోంది.
బీజేపీ పాలిత హర్యానా రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చారు. గతంలో కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఆఫీసులోనే బీర్, వైన్ సేవించేందుకు అనుమతులు ఇవ్వగా.. ఇప్పుడు తగిన ఫీజు చెల్లించి 24 గంటలు బార్ అండ్ రెస్టారెంట్‌లు ఓపెన్ చేసుకునేందుకు హర్యానా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ట్విట్టర్ డేటాను ఉపయోగించుకొని థ్రెడ్స్ యాప్ ను తయారు చేసినట్లు ఎలాన్ మస్క్ తరపు న్యాయవాది అలెక్స్ స్పిరో మెటా సంస్థకు లేఖ రాశారు. తమ ఉద్యోగస్తులను నియమించుకొని ఈ యాప్ ను క్రియేట్ చేసినట్లు ఆరోపించారు. సరైన వివరణ ఇవ్వకుంటే కోర్టులో దావా వేస్తామంటు లేఖలో హెచ్చరించారు.
టమాటాల రేట్లు ఇప్పుడు భగ్గుమంటున్నాయి. కేజీ టమాటా ఏకంగా రూ.250కి చేరింది. ఉత్తరాఖండ్ లోని గంగోత్రి ధామ్ ప్రాతంలో ప్రస్తుతం కిలో టమాటా రూ. 250 పలుకుతోంది. మరోవైపు ఉత్తరకాశీ జిల్లాలో కిలో రూ.180 నుంచి 200 వరకు ఉన్నట్లుగా అక్కడి వినియోగదారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఒక్కసారిగా టమాటా ప్రియమైందని కూరగాయల విక్రయదారులు అంటున్నారు. ఈ క్రమంలో ఉత్తరకాశీలో టమాటా ధరల పెరుగుదలతో వినియోగదారులు తీవ్ర ఇబ్బం...
కళ్లకు గంతలు కట్టి, శరీరాన్ని కేబుళ్లతో చుట్టేసి, గొంతు కోసి బతికుండాగానే పాతికేళ్లు కూడా లేని భారతీయ యువతిని ఆస్ట్రేలియాలో తన మాజీ ప్రియుడు గోతిలో పాతి పెట్టాడు. ఈ ఘటన విషయాలు ఇటివల వెలుగులోకి వచ్చాయి.
ఓ బాలిక పట్ల అండగా ఉండాల్సిన రక్షకభటుడే(constable) కామంధుడిగా మారి కాటేశాడు. తన ఇంట్లో పనిలో చేరిన బాలికపై ఆరునెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. అంతేకాదు ఎవరికైనా చెబితే చంపేస్తానని కూడా బెదిరింపులకు పాల్పడ్డాడు. అయినా కూడా ఆ అమ్మయి ధైర్యంగా పోలీసులకు చెప్పి అతన్ని అరెస్ట్ చేయించింది.
ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన బిచ్చగాడు మన భారతీదేశంలో ముంబై నగరంలో ఉంటున్నాడు. అతని ఆస్తి విలువ తెలిస్తే ఆశ్చర్యపోతారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కుమార్తె సితార దూసుకుపోతోంది. ఓ వైపు సోషల్ మీడియాలో పాపులరిటీ పెంచుకోవడం, తండ్రి తో కలిసి ఈవెంట్స్ కి హాజరు కావడం లాంటవి చేస్తూ ఆకట్టుకుంటోంది. తండ్రికి తగిన కూతురిగా పాపులారిటీ సంపాదించుకుంటోంది.