Sitara: సితార ఫస్ట్ యాడ్ కి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కుమార్తె సితార దూసుకుపోతోంది. ఓ వైపు సోషల్ మీడియాలో పాపులరిటీ పెంచుకోవడం, తండ్రి తో కలిసి ఈవెంట్స్ కి హాజరు కావడం లాంటవి చేస్తూ ఆకట్టుకుంటోంది. తండ్రికి తగిన కూతురిగా పాపులారిటీ సంపాదించుకుంటోంది.
ఇటవల సితార మరో ఘనత కూడా సాధించింది. ప్రముఖ బంగారు నగల తయారీ సంస్థ పిఎంజె జివెల్స్ ప్రత్యేకంగా సితార కలెక్షన్ పేరుతో ఓ స్పెషల్ బ్రాండ్ ని సృష్టించడం గమనార్హం. చాలా మంది పాపులర్ హీరోయిన్లకు కూడా ఈ క్రెడిట్ దక్కలేదు. కాగా, ఆ బ్రాండ్ జ్యువెలరీ సితార ధరించిన ఫోటోలను, దానికి సంబంధించిన యాడ్ లను న్యూ యార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ లో ప్రదర్శించడం విశేషం.
ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట సైతం వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు మహేష్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇంత చిన్న వయసులోనే సితార సంపాదించడం మొదలుపెట్టింది అని కొందరు కామెంట్స్ చేస్తుండటం విశేషం.
అయితే, ఈ ప్రకటన కోసం ఆమె అందుకున్న రెమ్యూనరేషన్ ఎంతో వింటే షాకైపోతారు. ఈ జ్యూవెల్లరీ యాడ్ కోసం సితార ఏకంగా రూ.కోటి తీసుకున్నారట. ఇది నమ్మడానికి షాకింగ్‌గా ఉన్నా ఇదే నిజమని తెలుస్తుంది. అంతటి మొత్తం కావడం వల్లే మహేష్.. సితార ఈ యాడ్ చేయడానికి ఒప్పుకున్నాడని సమాచారం. నిజానికి సితారకి అంతకు ముందే చాలా యాడ్స్ వచ్చాయట. కానీ మహేష్ నో చెబుతూ వచ్చారు. కానీ ఈ జ్యూవెల్లరీ యాడ్‌కి మాత్రం ఓకే చెప్పడానికి కారణం పారితోషికం అని తెలుస్తుంది. ఇక, కూతురి ఫోటోలను టైమ్ స్క్వైర్‌పై చూసి ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దానిని సోషల్ మీడియాలో కూడా తెలియజేసిన విషయం తెలిసిందే.