ప్రముఖ సంస్థ మెక్డొనాల్డ్స్(mcdonald) ఇండియాలోని వివిధ ప్రాంతాల్లోని స్టోర్ లలో తయారు చేస్తున్న బర్గర్లలో టమాటా వాడకాన్ని ఆపివేస్తున్నట్లు ప్రకటించారు. అది ఎందుకు? మరి ఏ ప్రాంతాల్లో నిలిపివేశారో ఇప్పుడు చుద్దాం.
దేశంలో టమాటాల(tomatoes) కొరత అనేక రాష్ట్రాల్లో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో కిలో టమాటా రూ.150 దాటేసింది. దీంతో అనేక మంది వినియోగదారులు టమాటాలను కొనుగోలు చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. మరికొంత మంది మాత్రం రేటు ఎక్కువైనా కూడా కొంటున్నారు. అయితే ఆలూ (బంగాళదుంప) సమోసాకు పర్యాయపదంగా ఉన్నట్లే, టమోటాలకు బర్గర్లతో సుదీర్ఘ అనుబంధం ఉంది. టమాటా ధర అధికంగా ఉండడంతో ఈ జోడీకి బ్రేక్ పడినట్లైంది. ఈ నేపథ్యంలో ఫాస్ట్ ఫుడ్ సంస్థ మెక్డొనాల్డ్స్(mcdonald) కీలక నిర్ణయం తీసుకుంది. తమ స్టోర్లలో తయారు చేసే బర్గర్ల(burgers)లో టమాటా వాడకాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. టమాటా నాణ్యతపై ఆందోళనలు, రికార్డు స్థాయి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇండియాలోని అనేక ప్రాంతాలలో టొమాటోలను దాని మెనూ ఆఫర్ల నుంచి తొలగించినట్లు తెలిపింది. న్యూ ఢిల్లీలోని రెండు మెక్డొనాల్డ్ స్టోర్లలో ఇప్పటికే నోటీసులు కూడా పెట్టారు. ఎంత ప్రయత్నించినప్పటికీ, ఖచ్చితమైన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా తగిన మొత్తంలో టమోటాలను పొందలేకపోయామని వివరించింది.
భారతదేశంలోని ఉత్తర, తూర్పు ప్రాంతాలలో సుమారు 150 మెక్డొనాల్డ్స్ అవుట్లెట్ల(outlets)లో ఇదే నిర్ణయం పాటించనున్నట్లు పేర్కొన్నారు. రుతుపవనాల కారణంగా ఉత్పత్తి, సరఫరాలో కొరత, అంతరాయాలతో టమోటాల(tomatoes) ధరలు(prices) పెరుగుతున్నాయి. భారతీయ సాంప్రదాయ వంటకాల్లో ప్రధానమైన టమోటాల టోకు ధరలు ఒక నెల వ్యవధిలో కొన్ని ప్రాంతాల్లో 300 శాతం పెరిగి, శనివారం గరిష్టంగా కిలో 150 నుంచి 250 రూపాయలకు చేరుకున్నాయి. రిటైల్ ధరలు ఇంకా ఎక్కువగానే ఉండడంతో చాలా మంది వినియోగదారులు తమ టమోటా వినియోగాన్ని తగ్గించుకుంటున్నారు. మెక్డొనాల్డ్స్ తమ మెనూ నుంచి టొమాటోలను తాత్కాలికంగా తొలగించినప్పటికీ, ఈ మార్పు ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి. టమోటా మార్కెట్ స్థిరపడే వరకు ఇతర రెస్టారెంట్లు, వ్యాపారాలు దీనిని అనుసరిస్తాయో లేదో చూడాలి మరి.