సందడే సందడి, ఖుషీ ఖుషిగా, స్వాగతం, ఏక్ నిరంజన్ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆదిత్య రామ్ దాదాపు పుష్కరకాలం తర్వాత సినీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు.
వివాదాస్పద స్వామి నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచారు. తమ దేశం అయిన కైలాస దేశ ప్రధానిగా నటి రంజితను నియమించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రకటన సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.
జగన్ అక్రమాస్తుల కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా సుప్రీం కోర్టు విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్ కు నోటీసులు జారీ చేసింది.
ప్రవేశ్ శుక్లాపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదైంది. తాగిన మత్తులో ఊగుతూ ఆ వ్యక్తి ఆదివాసి యువకుడిపై మూత్ర విసర్జనకు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చంద్రయాన్ పేలోడ్ ఉన్న క్యాప్సూల్‌ను జీఎస్ఎల్వీ రాకెట్‌తో ఈ రోజు అనుసంధానం చేశారు. సతీశ్ ధావన్ సెంటర్‌లో రాకెట్‌కు చంద్రయాన్ క్యాప్సూల్‌ను ఫిక్స్ చేశారు.
ఘోర కారు ప్రమాదంలో భారత మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్(praveen kumar), ఆయన కుమారుడు సురక్షితంగా బయటపడ్డారు. మంగళవారం రాత్రి వీరి వాహనాన్ని అతివేగంతో ట్రక్కు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక విడాకుల కేసు సోషల్ మీడియా..వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా వైరల్ అవుతోంది. మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకోబోతోందని చాలా ఏళ్లుగా ప్రచారం జరుగుతోంది.
గత కొన్ని నెలల నుంచి నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ మధ్య విభేదాలు నెలకొన్నాయని, వీరిద్దరూ విడిగా ఉంటున్నారని, త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఇటు మెగా కుటుంబం గానీ అటు చైతన్య కుటుంబం గానీ స్పందించలేదు. కానీ ఇటీవల విడాకులు తీసుకున్న తర్వాత తొలి పోస్ట్ చేసింది నిహారిక.
ఎయిర్‌పోర్ట్ నుంచి విమానం టేక్ ఆఫ్ అవడానికి సిద్ధం అవుతోంది. మరికాసేపట్లో విమానం గాల్లోకి ఎగురనుందని సిబ్బంది అనౌన్స్ చేశారు. ఇంతలో ఓ యువకుడు విమానం డోర్ తెరవండి అని గట్టిగా అరుస్తూ డోర్ వైపు పరుగెత్తాడు. ఈ ఘటనతో ప్రయాణికులంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు.