Zuckerberg's first tweet after 11 years.. Elon Musk's retweet
మెటా సీఈవో, ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్ బర్గ్(Mark Zuckerberg) ఎంత డైనమిక్ బిజినెస్ మేనో అందరికి తెలుసు. ట్విట్టర్(Twitter) వేదికను వదిలి దాదాపు 11 ఏళ్ల తర్వాత తిరిగి ట్విట్టర్ లో అడుగుపెట్టారు. ఈ ఉదయం ట్విట్టర్ లోకి మళ్లీ లాగిన్ అయ్యాడు. కొన్నాళ్లుగా ట్విట్టర్ కు పోటీగా మెటా డెవలప్ చేసిన థ్రెడ్స్(Threads) కు సంబంధించి పోస్ట్ చేశాడు. అయితే అతను ఒక ఇమేజ్ ను పోస్ట్ చేశాడు. స్పైడర్ మేన్ దుస్తులు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఉన్న ఫోటోను షేర్ చేశాడు. ఈ చిత్రంలో ఒక స్పైడర్ మేన్(Spiderman) మరో స్పైడర్ మేన్ ను వేలితో చూపుతూ ఉంటాడు.
ఇది 1967లో వచ్చిన స్పైడర్ మేన్ కార్టూన్ డబుల్ ఐడెంటిటీ లోనిది. కేవలం ఫోటో మాత్రమే పోస్ట్ చేశాడు ఎలాంటి కామంట్ అయితే చేయలేదు. ప్రస్తుతం ఈ పోస్ట్ ట్విట్టర్ హల్ చల్ చేస్తోంది. దీనిపై నెటిజనులు తమ అభిప్రాయాలను కామెంట్లరూపంలో పంచుకుంటున్నారు. దీనిపై ట్విట్టర్ సీఈఓ ఎలన్ మస్క్(Elon Musk) స్పందించాడు. థ్రెడ్స్ యాప్ ను ఉద్దేశించి ఉన్నది ఉన్నట్లు కాపీ చేయడం అనే అర్థం వచ్చేలా ఇది అక్షరాల కంట్రోల్ సీ ప్లస్ వీ అని రీట్వీట్ చేశాడు. దీనికి తగ్గట్టుగానే రకరకాల మీమ్స్ తో నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరి పోస్టులు ట్విట్టర్ లో హాట్ టాపిక్ గా మారాయి.